బీజేపీ బహిరంగ సభ కరపత్రాల పంపిణీ
సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఈ నెల 10వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే బీజేపీ బహిరంగ సభకు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఘనస్వాగతం పలికి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ శుక్రవారం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని బాపునగర్, వివేక్ నగర్ బస్తీ, కాపువాడ, పార్థివాడ బస్తీల్లో, పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోని కాలనీ వాసులకు, వాకర్లకు బీజేపీ బహిరంగ సభ కరపత్రాలను బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అందచేశారు. మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఉన్నత విద్యావంతులు, నిరుద్యోగులు, బీజేపీ అభిమానులు భారీఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయ కులు శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, శ్రీనివాస్, సత్యేందర్, లక్ష్మీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.






