9 May, 2026 | 2:33 AM

కామారెడ్డి మార్ట్‌లో చోరీ

09-05-2026 12:17 AM
  1. లక్ష నగదు అపహరణ, ఇద్దరు చోరీకి పాల్పడ్డట్లు సీసీ ఫుటేజ్‌లో నమోదు 
  2. అద్దాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డ దుండగులు 

కామారెడ్డి, మే 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి శ్లోక  మార్ట్ లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి సిరిసిల్ల రోడ్లో ఉన్న శ్లోక మార్ట్ లో అర్థరాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దుకాణం అద్దాలు ధ్వంసం చేసి ముఖాలకు మాస్క్ లో వేసుకొని చోరికి పాల్పడ్డారు.

శ్లోక మార్ట్ లో డ్రా లో ఉన్న లక్ష రూపాయల నగదును గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ లో ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డట్లు రికార్డు లో నమోదు అయ్యాయి. సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలిసిన కూడా ముఖాలకు మాస్కులు ధరించి పాల్పడడం కామారెడ్డి పట్టణంలో కలకలం రేపు తుంది. మార్టులో పనిచేసే వారి అండ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మార్ట్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.