14 August, 2026 | 2:58 AM

రైతులకు యంత్రాలు పంపిణీ

14-08-2026 12:18 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు, అగస్టు13(విజయక్రాంతి): పత్తి ఉత్పాదకత పెంపొందింపు మిషన్ (20262031)లో భాగంగా ఆమనగల్, మాడ్గుల మండలాల రైతులకు రూ. 20 లక్షల విలువైన మిషన్లను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తి సాగును లాభసాటిగా మార్చేందుకు, సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.