14 August, 2026 | 2:58 AM

మార్కెట్‌కు తీసుకెళ్లలేదని బాలిక ఆత్మహత్య

14-08-2026 12:18 AM

మల్లాపూర్‌లో విషాదం 

ఉప్పల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): కూరగాయల మార్కెట్కు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురై 14 ఏళ్ల  బాలిక ఆత్మహ త్యకు  పాల్పడిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది నాచారం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీనాదేవి కుటుంబం గత మూడు సంవత్సరాలుగా మల్లాపూర్లోని బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివసిస్తోంది.

12వ తేదీ రాత్రి కూరగాయల మార్కెట్కు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఆమె కుమార్తె కుషి చౌహాన్ (14) తనను వెంట తీసుకెళ్లాలని కోరింది. అయితే ఇంటి పనులు చూసుకోవాలని చెప్పి తల్లి మార్కెట్కు వెళ్లింది. రాత్రి సుమారు 9 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న మీనాదేవికి ఇంటి తలుపు లోపల నుంచి బిగించి ఉండటంతో అనుమానం కలిగింది. పలుమార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో తలుపు సందు ద్వారా చూడగా కుమార్తె చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.

వెంటనే స్థానికుల సహాయంతో తలుపు తెరిచి బాలికను కిందకు దించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తల్లి పోలీసులకు తెలిపింది. మార్కెట్కు తనతో రావడానికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఆర్థిక ఇబ్బందులతో కూలి..  

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ కూలి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడుమలర్ మోహన్ (35)  ఉపాధి కోసం ఇటీవల మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన మల్లాపూర్ సూర్య నగర్లో జీవనం కొనసాగిస్తున్నాడు.  మోహన్ కొద్దిరోజులుగా  తీవ్ర ఆర్థిక ఒత్తిడితో  సతమతమవుతూ  మనస్థాపన చెంది  ఆత్మహత్యకు పాల్పడ్డాట్లు  కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దర్యాప్తు అధికారి మట్టయ్య తెలిపారు.