18-09-2025 05:32:34 PM
అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంథని ప్రాథమిక పాఠశాలకు గురువారం మైక్ సెట్ ను అందజేశారు. రోటరీ అధ్యక్షుడు జక్కుల రాధా కిషన్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఈ పాఠశాలకు గ్రీన్ బోర్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సహాయ సహకారలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్, మాజీ కార్యదర్శి రాస ఆనంద్, తులసి పట్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.