18-09-2025 05:30:35 PM
అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు గురువారం ఉచితంగా టై, బెల్ట్స్, బ్యాడ్జెస్ లను అందజేశారు. దాత సుంకం భూషణ్ సహకారంతో వీటిని అందజేశారు. అనంతరం పాఠశాల తరఫున దాత సుఖం భూషణ్ ను ప్రధానోపాధ్యాయుడు పి.విజయ్ కుమార్ శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథం, పాఠశాల ఉపాధ్యాయులు దయాసాగర్, ప్రవీణ్ ,దేవేందర్, స్నేహ, మాజీ వార్డ్ మెంబర్ దేవయ్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.