18-09-2025 05:43:35 PM
చదువులు నేర్పిన గురువులకు సన్మానం
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని 1973 ఎస్ఎస్సీ 1975 ఇంటర్ బ్యాచ్ విద్యార్థులు పట్నం హైవే రెస్టారెంట్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురువారం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో చదువులు నేర్పిన గురువులు గురునాథ్ రెడ్డి, వేమారెడ్డి ప్రభాకర్, వేణు గోపాల్, లక్ష్మయ్య, రామచంద్ర రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రామచంద్రయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమలత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ లు హాజరైనారు.
ముందుగా జ్యోతి ప్రజల్లో కార్యక్రమం నిర్వహించి అనంతరం గురువులను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు గురువులు మాట్లాడుతూ విద్యతోనే విలువలు పెరుగుతాయని చదువులు నేర్పిన గురువులను గుర్తించి పూర్వ సమ్మేళనం కార్యక్రమం ద్వారా గురువారం సన్మానించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవారు కటకంరమేష్. బక్క ప్రభు. అర్జున్ రావు. పురం సుధాకర్. రామ్ రెడ్డి. నారాయణరెడ్డి. వీరేందర్. దత్తాత్రి, మనోహర్ శర్మ. అశోక్. బుచ్చి రాములు. వీర్ శెట్టి. విట్టల్ రెడ్డి. మల్లప్ప వీరమణి. లలితి. అరుణ. ఉమారాణి. ప్రమీల. తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.