ఓటర్లకు బీఆర్‌ఎస్ నేత డబ్బుల పంపిణీ
28-05-2024 12:46 AM
హనుమకొండ, మే 27 (విజయక్రాంతి): హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ఓ బీఆర్‌ఎస్ కార్యకర్త అడ్డంగా దొరికిపోయాడు. సదరు కార్యకర్త ఆటోలో కూర్చుని ఓటర్ స్లిప్ ఇస్తున్నట్లు నటిస్తూ, ఓటర్లకు డబ్బు ఇస్తున్నట్లు కొందరు వీడియో చిత్రీకరించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.






