6 August, 2026 | 3:26 AM

పేదలకు ఎన్‌ఈసీసీ స్టాళ్ల పంపిణీ

06-08-2026 01:29 AM

ఆదిభట్ల, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో పేద ప్రజలకు రూ.75 వేల విలువైన ఎన్‌ఈసీసీ స్టాల్ను అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా స్వయం ఉపాధి పొందే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ, టీపీసీసీ కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్, తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాస్, నాయకులు సామ భీమిరెడ్డి, దాసరి సుధాకర్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, మేతరీ దర్శన్, భద్రయ్య, నరసింహారెడ్డి,  మేతరి శ్రీహరి, గుడ్ల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.