02-07-2025 01:09:22 AM
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవ ర్గంలో ఏర్పాటు చేయనున్న సభలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే గతం లో ఇచ్చిన రేషన్‌కార్డుల మాదిరిగా కాకుండా.. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
బార్‌కోడ్‌తో సులభంగా యాక్సెస్ అయ్యేలా రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే వెల్లడించి న విషయం తెలిసిందే. స్మార్ట్ కార్డు నమూనాను కూడా సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు సైజు లో ఉంటుందని, ఒక వైపు సీఎం, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫొటోలు, మధ్యలో ప్రభుత్వం లోగో ఉండేలా డిజైన్ రూపొందించినట్టు సమాచారం.
కొత్త రేషన్‌కార్డుల కోసం భారీగానే దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వాటిని వడపోసి, అర్హత కలిగిన వారిలో 2 లక్షలకుపైగానే లబ్ధిదారులకు అందజేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కొత్త రేషన్‌కార్డుల పంపిణీ జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ కొత్త కార్డులు పంపిణి చేయలేదు.
దీంతో ఉమ్మడి కుటుంబంలో ఒకే కార్డు కలిగిన ఉండగా, కొడు కు లకు వివాహాలు జరిగి వేరుపడటం, వారికి కూడా పిల్లలు పుట్టి పెద్దవాళ్లయినవారూ ఉన్నారు. వేరుపడిన వారికి కొత్త రేషన్‌కార్డులు రాకపోగా, పాత కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అవలం బిం చాల్సిన విధానం, అర్హతల కోసం వేసిన సబ్ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది.
కొత్త రేషన్‌కార్డులు ఇవ్వ డం, ఇప్పుడున్న పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసేందుకు ప్రభు త్వం దరఖాస్తులను స్వీకరించింది. ప్రజాపాలన, మీ-సేవ కేంద్రాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడంతో.. పెద్దఎత్తున కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖ అధి కారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు.