calender_icon.png 5 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తనిఖీలు

02-07-2025 01:08:36 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, జూలై 1(విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉన్నతస్థాయి తనిఖీలు చేపడుతున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో డాక్టర్ విమల థామస్ తో కలిసి ఉన్నత స్థాయి తనిఖీ  నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రమాణాలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా మంగళవారం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్,  మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్నత స్థాయి తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. బోధన సిబ్బంది, పోస్టులు, ఖాళీల స్థితి, హాస్పిటల్లోని యంత్రాంగాలు, ఐసీయు, ఓటీ, సీటీ, ఎంఆర్‌ఐ, సీ-ఆర్మ్, విద్యార్థులకు వసతి, డిజిటల్ క్లాస్ రూమ్లు, లైబ్రరీ, మెస్, యాంటీ ర్యాగింగ్ వ్యవస్థలు తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ తనిఖీ నివేదికను ముఖ్య కార్యదర్శికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విమల థామస్ మాట్లాడుతూ హాస్పిటల్,  కాలేజ్ పరిపాలనల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి, న్యాయమైన ఆరోగ్య సేవలు అందించేందుకు  పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీతా దేవి, డాక్టర్ రవి శంకర్, డాక్టర్ జయ తదితరులుపాల్గొన్నారు.