02-07-2025 01:09:25 AM
శామీర్ పేట్, జూలై 1: రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి హకింపేట్ లోని క్రీడా పాఠశాలను మంగళవారం సందర్శించారు, పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, క్రీడా శిక్షకుల వివరాలను పాఠశాల ఓ ఎస్ డి మమతను అడిగి తెలుసుకున్నారు, పాఠశాలలో జరుగుతున్న క్రీడా అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉందో గ్రౌండ్ మొత్తం కలియతిరిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోరట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, ఓ ఎస్ డి మమత, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ప్రిన్సిపల్ కల్పన, ఆర్టిఏ మెంబర్ జైపాల్ రెడ్డి. క్రీడా శిక్షకులు తదితరులుపాల్గొన్నారు.