24 July, 2026 | 1:55 AM

దేశాయిపేట్‌లో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

24-07-2026 12:51 AM

బాన్సువాడ, జూలై 23 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామ ప్రాధమిక పాఠశాల(SC కాలనీ) లో విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులను గ్రామ యువ నాయకుడు ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్ జంగం గంగారం, సీనియర్ నాయకులు జంగం సాయిలు, ఏజాస్, సర్ఫరాజ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.