18-06-2025 05:51:30 PM
సిఐ చరమంద రాజు...
హుజూర్ నగర్: ఐఎన్టియుసి అనుబంధం ఏ వన్ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు(Circle Inspector Charamandaraju) ఆటోలకి పిసి నెంబర్ పంపిణీ చేశారు. సీఐ చరమందరాజు మాట్లాడుతూ... ఆటో డ్రైవర్స్, ఓనర్స్, ఆటో కార్మికులకు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని అలాగే కాకి చొక్కా ధరించాలని నియమ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రతి ఆటో కార్మికుడు క్రమబద్ధంలో ఆటోలో నడుపుకుంటూ జీవనం సాగించాలని, ఆటో కార్మికులకు నియమ నిబంధనలు తెలియజేశారు. కార్యక్రమంలో తన్నీరు మల్లికార్జున్, చిట్యాల అమర్నాథ రెడ్డి మేళ్లచెరువు ముక్కంటి, చింతకాయల రాము, రామరాజు యాదవ్, నాగేందర్ కోలాపూడి యోహాన్ తదితరులు పాల్గొన్నారు.