calender_icon.png 20 July, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేత

19-07-2025 01:11:42 AM

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

హనుమకొండ టౌన్, జూలై 18 (విజయ క్రాంతి); వరంగల్ ఎల్బీనగర్ లోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్  సత్య శారద లతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, స్వయం సహాయక  మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.