21 July, 2026 | 11:22 AM

ఇంటింటికీ మొక్కల పంపిణీ

21-07-2026 12:00 AM

మల్దకల్ , జూలై 20:  పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఎల్కూర్ గ్రామంలో సోమవారం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ ప్రారంభించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభావతి, గంగన్న, పెద్ద మునెన్న, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.