21 July, 2026 | 11:22 AM

కల్వకుర్తిలోని మద్యం దుకాణంలో చోరీ

21-07-2026 12:00 AM

రూ.2.5 లక్షల నగదు అపహరణ

కల్వకుర్తి జూలై 20: పట్టణంలోని నాగర్కర్నూల్ చౌరస్తాలో ఉన్న ఓ మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం దుకాణాన్ని తెరిచిన నిర్వాహకులు కౌంటర్లో ఉంచిన సుమారు రూ.2.5 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.

దుండగుడు దుకాణం వెనుక వైపు గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి కౌంటర్లోని నగదును అపహరించాడు. అనంతరం అదే మార్గంలో బయటకు వెళ్లడంతో ముందు భాగంలోని తాళాలు, షట్టర్కు ఎలాంటి నష్టం జరగలేదు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కల్వకుర్తి సీఐ భీమ్కుమార్, ఎస్త్స్ర కురుమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణ సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.