calender_icon.png 24 November, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోసమే మహిళలకు చీరల పంపిణీ

24-11-2025 12:21:25 PM

మాజీ జడ్పీటీసీ కవిత

బెజ్జంకి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు చీరలను పంపింని చేస్తుందని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బిఆర్ ఎస్ మాజీ జడ్పీటీసీ కనగండ్ల కవిత  విమర్శించారు. సోమవారం విజయక్రాంతి మండల ప్రతినిధి తో  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహి ళలకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ పండుగకు చీర లు అందిస్తామని చెప్పి బతుకమ్మ పండుగకు అందియ్య లేదని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ఉన్నాయని, మహిళలకు ఇందిరమ్మ చీరలంటూ పంపి స్తున్నారని విమర్శించారు. మహిళల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతలేని చీరలను అందిస్తుందని

ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరే కత ఉన్నది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసినా ఎన్ని డ్రామాలాడిన స్థానిక సంస్థ ఎన్నికలలో ఎన్నికలలో బిఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.