24-11-2025 09:20:05 AM
కళశాలల తరలింపుపై నిరసన
ఎమ్మెల్యే పదవికి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్..
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్(Kodangal)లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. కొడంగల్ కు మంజూరైన మెడికల్, వెటర్నరీ కళాశాలలను తరలింపుపై నిరసన చేపట్టారు. విద్యాసంస్థలను కొడంగల్ నుంచి దుద్యాలకు తరలింపుపై అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన అన్ని విద్యాస్థంస్థలను కొడంగల్ లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలను శంకుస్థాపన చేసిన స్థలంలోనే నిర్మాణం చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కొడంగల్ అభివృద్ధి చేసి ఉంటే మరల పోటీ చేసి గెలవాలని కేడీపీ జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది.
కొడంగల్ లో ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సభకు దూరంగా ఉండి కొడంగల్ ప్రాంత ప్రజలు నిరసన తెలపాలని కోరారు. సోమవారం నిర్వహించే కొడంగల్ స్వచ్ఛంద బంద్(Kodangal voluntary bandh) ను విజయవంతం చేయాలని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించునున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కొడంగల్ కు వెళ్లనున్నారు. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ను నిర్మణానానికి రేవంత్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్, ఎడ్యుకేషన్ హబ్ ను రేవంత్ పరిశీలించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.