calender_icon.png 24 November, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యంగా ఉండండి

24-11-2025 12:23:16 PM

 ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర : ఆధ్వర్యంలో పడకూడదని ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం  మండలం మండల పరిధిలోని  ఫర్దిపూర్ గ్రామానికి చెందిన కమలన్న  ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో ప్రమాద బీమా తో రూ 4లక్షల 50వేలచెక్కును స్థానిక నాయకుల సమక్షంలో కమలన్న సతీమణి పుష్ప కు ఎమ్మెల్యే అందజేశారు. విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఒకటికి రెండు మాటలు చెక్ చేసుకుని అడుగులు వేయాలని సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి విద్యుత్ పనులు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.