calender_icon.png 25 June, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా దుస్తుల పంపిణీ..

24-06-2025 05:35:35 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో తెలంగాణ సీడ్స్ మాజీ డైరెక్టర్(Former Director of Telangana Seeds) అర్జుల సంపత్ రెడ్డి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి ఎల్ల వేళలా తోడుంటానని విద్యార్థులు చదువు ఒకటే కాకుండా వివిధ క్రీడలో ముందుండాలని క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్మాస్టర్ వెంకట్ రెడ్డి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్  వీరాస్వామి, సుంకరి పారిజాత, ఉపాధ్యాయ బృందం సంతోష్ కుమార్, సుదర్శన్ బాబు, పైడి రాజు, మధు, సుజాత, స్వరూప పాల్గొన్నారు.