calender_icon.png 15 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

14-10-2025 09:53:37 PM

జగదేవపూర్: మండల పరిధిలోని వెంకటాపూర్ బీజీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పలకలు పెన్సిల్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిహెచ్ఎస్ మునిగడప, గొల్లపల్లి  ప్రధానోపాధ్యాయులు కనకయ్య పాఠశాల నరేందర్ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రస్సులు పలకలు పెన్సిల్లు అందించడం జరిగింది. ఈ సందర్బంగా జడ్.పి.హెచ్.ఎస్ మునిగడప కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలు ఆడటం ద్వారా శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండటం ద్వారా చదువు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అలాగే స్పోర్ట్స్ డ్రస్సులు విద్యార్థులను ఎంతో ఉత్తేజపరుస్తాయన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాత్లావత్ బొద్దు నాయక్ మాట్లాడుతూ పాఠశాల పిల్లలకు డ్రస్సులు పలకలు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని దాతలు చెక్కల మహేష్, చెక్కల గణేష్ లను అభినందిస్తూ ముందు ముందు మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, విద్యా వాలంటరీ శ్రీమతి స్వరూప, పోకల బాబు, చెక్కల సుధాకర్, చెక్కల నాగపురి, సత్యనారాయణ, పరమేష్, చెక్కల నరేష్, బాలు, భాను, రవి, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.