14-10-2025 09:56:18 PM
జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రతి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైపాడు వైభవ్ రఘునాథ్ స్పష్టం చేశారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 126 స్మార్ట్ ఫోన్ల ఆచూకీని గుర్తించి బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్, (సిఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే ఆన్లైన్ పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యిఇలా జిల్లా వ్యాప్తంగా 2.5 కోట్ల విలువ చేసే 1,631 స్మార్ట్ ఫోన్ లను రికవరీ చేసి ఆయా బాధితులకు అప్పజెప్పడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. అందుకు జిల్లాలోని ప్రత్యేక టీం నిర్విరామంగా శ్రమిస్తుందని పేర్కొన్నారు. వారితో పాటు జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు.