21-09-2025 08:32:24 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా జెడ్పి హైస్కూల్లో ఆదివారం సాయంత్రం వీకే స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్.కె షఫీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులకు టీ షర్టులను పంపిణీ చేశారు. కృసెడ్ టెక్నాలజీ ఐటీ సర్వీస్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న క్లబ్ ప్రెసిడెంట్ షఫీ కుమారుడు షేక్ షాహీర్ పాషా సహకారంతో క్రీడాకారులకు టీ షర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జనరల్ సెక్రటరీ ఎస్.కె రాజ్ మహమ్మద్, కోశాధికారి రవీందర్ తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.