calender_icon.png 21 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ సస్పెండ్

21-09-2025 08:54:50 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఐసీయు విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ కే. భార్గవ్ ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆమె సస్పెన్ష న్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ఐసియులో పనిచేసే కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఏప్రిల్ 2025 నుండి ఇప్పటివరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించడం జరిగిందని, ఈ విషయంపై విచారించగా ఐసీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్టు పీరియడ్ ఈ సంవత్సరం మార్చి 31తో ముగిసిందని, అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటాయించడం లేదా అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కే. భార్గవ జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎలాంటి ఫైల్ ను సమర్పించలేదని తెలిపారు. అందువల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకుగాను తక్షణమే భార్గవ్ను విధుల నుండి సస్పెండ్ చే సినట్లు ఆమె వెల్లడించారు. క్రమశి క్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు భార్గవ్ సస్పెన్షన్ లో కొనసాగుతారని, సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా భార్గవ్ కార్యస్థానాన్ని వదిలి వెళ్ళకూడదని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.