21-09-2025 08:30:32 PM
నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ(Dharma Samaj Party) నాగారం మండల కమిటీని జిల్లా కన్వీనర్ సూరెపెల్లి సైదులు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు నిరంజన్ యాదవ్, విజయ రామరాజు పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ నాగారం మండల నూతన అధ్యక్షుడిగా చిప్పలపల్లి నాగార్జున, ఉపాధ్యక్షులుగా రావుల వినయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా పేరాల పెద్ద శ్రీనివాస్, కోశాధికారిగా పేరాల వీరేష్, కార్యదర్శిలుగా బెల్లి వీరయ్య యాదవ్, కండె విజయ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తదితరులు పాల్గొన్నారు.