calender_icon.png 21 September, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

21-09-2025 08:40:17 PM

రెబ్బెన (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుండేటి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మాంతు సమ్మయ్య, కోశాధికారి మారిన చందర్ మండల పద్మశాలి ఉపాధ్యక్షులు అంకం కైలాసం, వడ్డేపల్లి శ్రీపతి, భోగ రవీందర్ ,చిప్ప శ్రీనివాస్, సాయికిరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.