calender_icon.png 21 September, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి భారతీయునికి లబ్ధి..

21-09-2025 08:38:35 PM

దసరా, దీపావళి దేశ ప్రజల ఇళ్లల్లో ముందస్తు సంబరాలు..

చిట్యాల (విజయక్రాంతి): జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి భారతీయునికి లబ్ధి చేకూరుతుందని జీఎస్టీ సంస్కరణల కమిటీ జిల్లా కన్వీనర్ మైల నరసింహ ఆదివారం తెలిపారు. దసరా, దీపావళికి ముందు దేశ ప్రజలకు భారీ ఊరట ఉంటుందని స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నిజం చేస్తూ సెప్టెంబర్ మూడవ తేదీన జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్ల దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు దసరా, దీపావళి పండుగల వాతావరణం ఇండ్లలో నెలకొన్నదని, నల్లగొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు, జీఎస్టీ సంస్కరణల కమిటీ జిల్లా కన్వీనర్ మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామానికి చెందిన మైల నరసింహ దేశ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి భారతీయుడు సెప్టెంబర్ 22 తర్వాత అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. 2017 కు ముందు దేశంలో అన్ని రాష్ట్రాలలో వేరు వేరుగా రేట్లు ఉండేవి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు ఒకే రేటు ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప చారిత్రాత్మకంగా నిర్ణయమని ఆయన కొనియాడారు.