21-09-2025 08:47:07 PM
బంగారు రంగు చేనేత పట్టుచీరలో త్రిపుర సుందరి దేవిగా దర్శనం.
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పట్టణంలో గల శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పట్టణ మార్కండేయ పద్మశాలి సంగం ఆధ్వర్యంలో అమ్మవారికి చేనేత పట్టుచీర, సారెను ఆదివారం సమర్పించారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి పల్లకిలో అమ్మవారికి సమర్పించే చీరతో ఊరేగింపు పట్టణంలో నిర్వహించారు. చీర దాతను చేపూరి శ్రీనివాస్ శోభ దంపతులను పద్మశాలీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, పద్మశాలి అధ్యక్షులు జెల్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశ్వర్లు, కుకుడాల గోవర్ధన్, జెల్ల సత్తయ్య, వలకీర్తి రమేష్, గంజి కృష్ణయ్య, గంజి సుధాకర్, మిర్యాల ప్రకాష్, గంజి గోవర్ధన్, జెల్లా రమేష్ తడక మురళి, కృష్ణమోహన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.