calender_icon.png 21 September, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

21-09-2025 08:45:00 PM

రేగొండ (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు మండల వ్యాప్తంగా మహిళల ఆటపాటలతో ఆనంద భరితంగా జరిగాయి. ఈ క్రమంలోనే రేగొండ మండలంలోని  తిరుమలగిరి గ్రామంలో భూలక్ష్మి దగ్గర మహిళలంతా ఎంగిలిపూల బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చుకొని వచ్చి బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకలను చిన్నారులు, మహిళలు కోలాట పాటలతో సందడిగా జరుపుకున్నారు.