calender_icon.png 13 June, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు పుస్తకాల పంపిణీ

12-06-2025 10:47:21 PM

అనంతగిరి మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వరరావు..

అనంతగిరి: మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశాల నందు 1 తరగతి నుండి 5వ తరగతి వరకు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 6 నుండి 10 తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేసి అనంతగిరి మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు(Former MPP Chunduru Venkateswara Rao) వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వారు అందించే ఉచిత యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు సన్న బియ్యంతో  మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ స్కూళ్లలో విద్య అభ్యసించాలని వారు సూచించారు. ఇట్టికార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ బావ సింగ్, సీనియర్ ఉపాధ్యాయులు పోటుశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి గద్దె రామారావు, వీరబోయిన సైదులు,  అంగన్వాడి సిబ్బంది, వి బి కే సిబ్బంది, సంఘ బంధం లీడర్లు, విద్యార్థులు తల్లిదండ్రులు  తదితరులు పాల్గొన్నారు