24 July, 2026 | 2:24 AM

ప్రజా సౌకర్యాలపై జిల్లా యంత్రాంగం ఫోకస్

24-07-2026 12:22 AM

గూడూరు వాటర్ ఫిల్టర్, చెక్‌డ్యాం పరిశీలన

నాగలిగిద్ద, జూలై 23: ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు, అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం గురువారం నాగలిగిద్ద మండలంలో పలు ప్రాంతాలను తనిఖీ చేసింది. అడిషనల్ కలెక్టర్ పాండు గూడూరు గ్రామంలోని వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఆకస్మికంగా పరిశీలించి తాగునీటి సరఫరా, మోటార్ల పనితీరు, నిర్వహణలో ఉన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లాంట్ను నిరంతరం నిర్వహిస్తూ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈఈ నాగభూషణం, డీఈ బాలకృష్ణలతో ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక అంశాలు, అవసరమైన మరమ్మతులపై చర్చించి పలు సూచనలు చేశారు.  అనంతరం శేరి దామరగిద్ద గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్డ్యాంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఏపీడీ జయలక్ష్మి, ఎంపీడీవో మహేశ్వరరావు, ఈఈ నాగభూషణం, డీఈ బాలకృష్ణ, ఏపీఓ మురళి, ఏఈ మధుసాయి కిషోర్, పంచాయతీ కార్యదర్శులు గోపాల్ రెడ్డి, రాజయ్య స్వామి, రఫీ ,టిఏ సుధాకర్, మచేందర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.