16 April, 2026 | 9:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు

31-12-2025 12:00 AM

కాటారం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): కాటారం మండలంలో ఎరువుల సరఫరా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనతో పాటు మహాదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ కలిసి కాటారం మండలంలోని వివిధ ఎరువుల డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా డీలర్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు.

స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించి, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీలర్లకు సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.