calender_icon.png 31 December, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక శోభితం వైకుంఠ ఏకాదశి

31-12-2025 12:00:00 AM

సంగారెడ్డి, డిసెంబర్ 30(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ రామ్ మందిర్ లో గరత్మంతుడుపై ఆసీనులైన సీ తా రామ లక్ష్మణులను శావాపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతా రామ లక్ష్మణుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది.

గరత్మం తుడిపై ఆసీనులైన ఉత్సవ మూర్తుల ఊరేగింపులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారె డ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు భజనలు చేస్తూ పాటలు పాడుతూ పాల్గొన్నారు. జగ్గారెడ్డి స్వయంగా భజన పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. రామ్ మందిర్ నుండి మొదలుకొని భవాని మందిర్ మీ దుగా శావా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం రామ్ మందిర్ లో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. రామ్ మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌లో

నారాయణఖేడ్, డిసెంబర్ 30: పవిత్ర వై కుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నా రాయణఖేడ్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మంగళవారం భ క్తులతో కిటకిటలాడినాయి. నారాయణఖేడ్ మండల పరిధిలోని హనుమంతరావుపేట్, వెంకటాపూర్ చౌరస్తాలోని గట్లల్లో వెంకటేశ్వర స్వామి, సంజీవనరావుపేట, కంగ్టి, కల్హె ర్, సిర్గాపూర్ మండలాల పరిధిలోని ఆయా దేవాలయాలు భక్తులతో కిట కిటలాడాయి.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల భక్తులు ప్ర త్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ని యోజకవర్గం లోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి మరింత జరగాలని కోరుతూ భగవంతుని వేడుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

మెదక్‌లో పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి/ మెదక్, డిసెంబర్ 30(విజయక్రాంతి):వైకుంఠ ఏకాదశి పర్వదినం సం దర్భంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని వైష్ణవ ఆలయాల్లో అంగరంగ వైభవం గా వేడుకలు నిర్వహించారు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిలకు సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుండే వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు, ఉత్సవ మూర్తుల ఊరేగింపు, కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని వైకుంఠపురంలోని శ్రీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆ లయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా తరలివచ్చారు.

వేలాది మంది ఉద యం నుండి సాయంత్రం వరకు స్వామిని దర్శించుకొని తరించారు. వైకుంఠపురంలో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజర్సింహ్మ దంపతులు హాజరై ఊరేగింపు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పోలీసులు బందోబస్తు ని ర్వహించారు. అలాగే మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వేంకటేశ్వర ఆ లయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరైన స్వామిని దర్శించుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించినకార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి

పటాన్ చెరు, డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ రో జు భెల్ టౌన్షిప్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆధర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి కు టుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షత కోసం ప్రార్థనలు చేశారు.ఆలయ వే ద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యక ర్తలు, భక్తులు పాల్గొన్నారు.

నంగునూరులో

నంగునూరు/ బెజ్జెంకి/ కొండపాక/ సిద్దిపేట రూరల్, డిసెంబర్ 30: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యం త వైభవంగా జరిగాయి. మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తుల నామస్మరణతో ఆలయాలను విద్యుత్ దీపా లు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. దీంతో ఆధ్యాత్మిక శోభను సంతరిం చుకున్నాయి.

సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ కే హైమావతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. ఆలయానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండపై గల లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పాలమాకుల, కోనాయిపల్లి గ్రామాల్లో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కోనాయిపల్లిలో ఉత్తర ద్వార దర్శనం, పాలమాకులలో గంధాలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు మంగు రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ, క్యూ లైన్ల నిర్వహణ వంటి మెరుగైన ఏర్పాట్లు చేశారు. దుబ్బాక లోని బాలాజీ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు గంటల తరబడి బారులు తీరారు.

కొండపాక మండలంలోని ఆనంద నిలయం వేంకటేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే వేదమంత్రాల మధ్య ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. సిరిసినగండ్ల వేణుగోపాల స్వామి, దుద్దెడ వేణుగోపాల సహిత వేంకటేశ్వర ఆలయం, అష్టాదశ శక్తిపీఠం తదితర దేవాలయాల్లో భక్తులు భా రీగా తరలివచ్చి పూజలు చేశారు. కుకునూరుపల్లి రామాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

బెజ్జంకి మండల కేం ద్రంలో ఏకశిలపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాజీవ్ రహదారి పక్కన గల తి మ్మారెడ్డిపల్లి ఆనంద నిలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. జిల్లాలోని అన్ని ఆలయా ల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు,పోలీసులు తగిన ఏర్పా ట్లు చేశారు. భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడంతో పాటు,ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యం కల్పించారు.

మల్లన్న హుండి ఆదాయం రూ. కోటి 15 లక్షలు 

కొమురవెల్లి, డిసెంబర్ 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వా మి హుండీ లెక్కింపును ఆలయ వర్గాలు మంగళవారం చేపట్టాయి. హుండీ లెక్కింపు ను ఆలయ ముఖమండపం వద్ద చేపట్టారు. ఈ లెక్కింపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. లెక్కింపులో శ్రీ లలితా సేవా సమితి వారు పాల్గొన్నారు. 49రోజులకు గాను రూ. కోటి 15 లక్షల 42వేల 56 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగా రం 60 గ్రాములు, మిశ్రమా వెండి 5కిలోల 500 గ్రాములు, విదేశీ కరెన్సీ 50నోట్లు, హుండీల ద్వారా లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకటేష్ తెలిపారు.

దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. కార్యక్ర మంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ పాలకమండలి చైర్మన్ గంగం నరసింహారెడ్డి, సభ్యులు సార్ల లింగం, వెల్గల మల్లేశం తదితరులు పాల్గొన్నారు