calender_icon.png 7 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

07-02-2026 12:00:00 AM

హనుమకొండ, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి):వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో హనుమకొండ జిల్లాకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాములను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం పరిశీలించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల చేపట్టే సాధారణ తనిఖీలలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ( ఈవీఎంల)ను పోలీస్ భద్రత, సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ గోదాంలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు వేసి ఉన్న సీళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్ తదితరులు ఉన్నారు.