07-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నూతనంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్ళు సీ.హెచ్ శ్రీనివాసరావు, పి. రాంబాబు, డీ. వెంకటేశ్వర్లు కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి పొందిన మీ రంతా మరింత నిబద్ధతతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించాలని, క్రమశిక్షణ, సేవాభావం, స్నేహపూర్వక దృక్పథంతోవిధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు.