calender_icon.png 27 January, 2026 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యామిలీ డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

03-10-2024 04:55:24 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కలెక్టర్ కంది, సంగారెడ్డి మండలాల్లో పర్యటించారు. ఫ్యామిలీ డిజిటల్ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం వివరాలు పకడ్బందీగా సేకరించి 5 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అక్టోబర్ 9న వివరాల స్క్రూటినీ చేసి అక్టోబర్ 10న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సమాచారంతో కూడిన నివేదిక సమర్పించాలని తెలిపారు. ఈ సర్వేలో కంది మండల తాసిల్దార్ విజయలక్ష్మి, కంది గ్రామపంచాయతీ విద్యాధర్, ఎంపీ ఓ మహేందర్ రెడ్డి, తోపుగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.