27-01-2026 07:45:58 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం 31వ డివిజన్ పరిధిలోని న్యూ శాయంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దాతలు ప్రకాష్ రెడ్డి తిరుమల ఆధ్వర్యంలో కంప్యూటర్ లు, టిఫిన్ బాక్స్ లను ఉచితంగా ఎమ్మెల్యే చేతుల మీదగా పాఠశాలకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను చేపడతానని తెలిపారు. అంతకుముందు హంటర్ రోడ్డు నంది హిల్స్ కాలనీలో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
రోడ్డు, డ్రైనేజీ పరిస్థితులను పరిశీలించి, ప్రధాన రోడ్డు వెంట ఉన్న మురుగు కాల్వలను వెంటనే శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు సురేందర్, కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, రాజకుమార్, సత్తు రమేష్, నాయిని లక్ష్మారెడ్డి, కృష్ణ, కార్యకర్తలు, కాలనీవాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.