calender_icon.png 27 January, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీఘట్టు మైసమ్మ దేవస్థానం కమిటీ నూతన డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారం

27-01-2026 08:14:46 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ శ్రీఘట్టుమైసమ్మ  దేవస్థానం కమిటీ నూతన డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ ప్రణీత్ ఆలయ డైరెక్టర్లుగా నియమితులైన బర్ల దేవేందర్ ముదిరాజ్, బొక్క జంగారెడ్డి, పోట్ల చెరువు నాగరాజు, కడపోల్ల హేమలత సుధాకర్ లచే ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా వజ్రేష్  యాదవ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఆలయ నూతన కమిటీ డైరెక్టర్లు కృషి చేయాలని సూచించారు. ఆలయం కార్యనిర్వాహన అధికారిని ఎల్. భాగ్యలక్ష్మి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, కీసర దేవస్థానం ధర్మకర్త సగ్గు అనీత శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్,  నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, కడపోల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.