calender_icon.png 27 January, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన రోడ్డు భద్రత వారోత్సవాలు

27-01-2026 07:23:18 PM

సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి

సిఐ గోవిందరెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): వాహనదారులు అందరూ సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బోడుప్పల్ కమాన్ ఉప్పల్ డిపో వద్ద విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ సూచనల మేరకు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

వాహనదారులు సైతం ప్రభుత్వం కోసమో, పోలీసుల కోసమో కాకుండా తమ కుటుంబం కోసం తన నూరేళ్ల జీవితాన్ని కాపాడుకోవడం కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపద్దని, హెల్మెట్ ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్లో వాహనాలు నడపద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు  కృష్ణయ్య, తిరుపతి, రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.