27-01-2026 08:00:28 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇటీవల జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన కె.హరిత ఐఏఎస్ ను మంగళవారం మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ కుమార్ కొత్త కలెక్టర్‌కు గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు, అవసరాలు వివరించారు.
అందులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, పేదలకు మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, నాయకులు అబ్దుల్లా, సోమశేఖర్, సంతోష్ శ్యామ్ తదితరున్నారు.