27-01-2026 07:56:57 PM
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో దించుతుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వివిధ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.