calender_icon.png 21 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

21-01-2026 12:07:24 PM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా శాఖ రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు కాటం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు విద్యాసాగర్ రెడ్డి, సుదర్శన్, కోశాధికారి జిల్లెల రఘు, ఉపాధ్యక్షులు మెహరాజ్, ఫోటో గ్రాఫర్ రఘు, తదితరులు.