calender_icon.png 23 July, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతతండా హరిజన చెర్రీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

23-07-2025 12:00:00 AM

టేకులపల్లి, జులై 22 (విజయక్రాంతి):టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పరిధిలోని పాతతండా హరిజన చెర్రీ మం డల పరిషత్ ప్రాధమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పాటశాలలో రెండో తరగతి చదువుతున్న వి ద్యార్థుల గదికి వెళ్లి విద్యార్థుల రాత పుస్తకాలను పరిశీలించి విద్యార్థులతో వారి పేర్లను రాయించారు.

పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థుల సామర్ధ్యాలు బాగున్నాయ న్నారు. పరిసరాలు శుభ్రాంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్థులు పాఠశాలకు మరొక భవనం అవసరం ఉందని కొత్త భవనం మంజూరి చేయాలనీ కోరారు.మండలంలో పాఠశాలల నిర్వహణ పై ద్రుష్టి సారించాలని ఎంఈఓ జగన్ ను ఆదేశించారు.