23-07-2025 12:13:36 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21న ప్రారంభమయ్యాయి. కనీసం ఒక్క అంశంపై కూడా చర్చించకుండా రెండు రోజులు వాయిదా పడింది. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ఓటర్ల జాబితాల అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల మూడవ రోజు బుధవారం తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మొదటి రెండు రోజులు బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశంతో వర్షాకాల సమావేశాల చర్చకు వీలు కల్పించలేదు, ఉభయ సభలు ప్రతిపక్షాల గందరగోళం, నినాదాలతో హోరెత్తించాయి.
ఈ అంశంపై పార్లమెంటు కాంప్లెక్స్(Parliament Complex)లోని మక్కర్ ద్వార్ వద్ద ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. రెండు సభలు పదే పదే వాయిదా పడుతు భోజనం విరామం వరకు రద్దు చేయబడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల నిరసనలు, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఎన్నికల జాబితా వివాదం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాలపై చర్చలకు డిమాండ్ చేస్తున్నాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ఒక్కో అంశంపై చర్చిద్ధామని సూచించినప్పటికి ప్రతిపక్ష ఎంపీలు సభలో నినాదాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడతున్నాయి.
ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజా ఇవాళ్టి ఉభయ సభాలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షలు ఆపరేషన్ సిందూర్‌పై తక్షణ చర్చకు డిమాండ్ చేయడంతో బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై వచ్చే వారం లోక్‌సభ, రాజ్యసభలో చర్చించే అవకాశం ఉంది. ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ రాజీనామా కూడా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కొత్త మలుపును సృష్టించింది.