జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఫ్లెక్సీలు చించివేత
- పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు
- ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి ఫోటో లేకపోవడంతోనే తొలగించినట్లు అనుమానాలు
నల్లగొండ టౌన్, జూన్ 9: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు జిల్లా కేంద్రంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పలుచోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం డిసిసి అధ్యక్షుని అభిమానంలో ఆందోళన కలిగించింది. ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో లేని కారణంగానే తొలగించారా అనే అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టేన అప్పటినుండి నేటి వరకు మంత్రికి డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఆయన నియమాకాన్ని మంత్రి వ్యతిరేకిస్తు సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు.నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కైలాస్ నేతతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కేవలం నల్గొండ జిల్లా కేంద్రంలో మాత్రమే ఆయన నియమకాన్ని వ్యతిరేకిస్తున్నారు. డిసిసి అధ్యక్షుని హోదాలో కైలాస నేతను ఆహ్వానించడం లేదు బీసీ కావడంవలన సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు.పార్టీ పరంగా చేపట్టి అన్ని కార్యక్రమాలను డిసిసి అధ్యక్షుడు తన వర్గంతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.






