18 July, 2026 | 8:02 PM

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

18-07-2026 07:25 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బెజ్జంకి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, ఓపీ సేవలు, మందుల నిల్వలు, ల్యాబ్ సేవలు, పారిశుధ్యం, రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాలని డీఎంహెచ్‌వో సూచించారు. అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి సేవలపై ప్రజలు  ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.