calender_icon.png 12 October, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా పెరిక సంఘం నాయకులు

12-10-2025 07:10:19 PM

మంచిర్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ పట్టణంలోని కోకాపేటలో నూతనంగా నిర్మిస్తున్న పెరిక భవన్ లో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా గటిక విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిని మంచిర్యాల జిల్లా పెరిక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బేర సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోటపలుకుల శ్రీనివాస్, మేడం తిరుపతి, ముత్యం వెంకట స్వామి, లక్షేట్టిపేట మండల యూత్ ఉపాధ్యక్షులు ఎంబడి రమేష్ తదితరులు ఉన్నారు.