calender_icon.png 12 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీ పార్టీలో భారీగా చేరిన కరీంనగర్ యువత

12-10-2025 07:13:36 PM

నూతన సభ్యులకు కండువాలు కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధి నుండి దాదాపు 60 మంది యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న స్వయంగా కొత్త కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి వారిని టీఆర్పీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ టీఆర్పీ పార్టీ  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం జన్మించిన సంస్థ అని తెలిపారు. గతంలో అగ్రవర్ణ నేతల చేతిలో సామాన్య వర్గాలు ఎన్నో సార్లు మోసపోయాయని, ఇకపై రాజకీయ అధికారం సామాన్యుల చేతుల్లో ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించామన్నారు. తదనంతరం అఖిల్ పాషా మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించటం నా అదృష్టం అని అన్నారు.

కరీంనగర్, హుజూరాబాద్ నుండి 60 మంది యువకులు ఒకే రోజు టిఆర్పిలో చేరడం పార్టీ శక్తిని స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే కరీంనగర్ జిల్లాలో టీఆర్పీ జెండా ఎగురవేస్తామని, గ్రామాగ్రామానికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తూనే సామాజిక న్యాయం సాధన దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చేరిక కార్యక్రమంలో టిఆర్పి నాయకులు, స్థానిక కార్యకర్తలు, కొత్తగా చేరిన సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజల ఆత్మగౌరవం కోసం తీన్మార్ మల్లన్నతో కలసి పనిచేస్తామని వారు సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివరాత్రి మోహన్, చెరుకు పైడయ్య, దాట్ల శ్రీనివాస్, నేదునూరు కుమారస్వామి, బుత్కురి మధు తదితరులకు అఖిల్ పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.