calender_icon.png 12 December, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల మొదటి దఫా పోలింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

12-12-2025 12:24:53 AM

మణుగూరు, డిసెంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలో తొలి విడత పోలింగ్ సరళిని ఎస్పి రోహిత్ రాజు పరిశీలించారు.గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ నకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను తెలుసుకుంటూ ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు.

అశ్వాపురం మండలం ఆనందపురం,మణుగూరు మండలం సమితి సింగారం,బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి, బిపిఎల్ పాఠశాల,సారపాక మజీద్ రోడ్డు ప్రభుత్వ పాఠశాల అనంతరం భద్రాచలం పంచాయతీలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల,నన్నపునేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదలగు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.

మొదటి దఫా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.